ఆ మాటలు అన్నవాళ్లు ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందిస్తే గొప్ప హిట్లు వస్తాయి: చిరంజీవి సెటైర్

  • రేపు గాడ్ ఫాదర్ రిలీజ్
  • చిత్రబృందం ప్రెస్ మీట్
  • మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారంపై చిరంజీవి స్పందన 
  • ఆ మాటలన్నవాళ్లు గొప్ప క్రియేటర్స్ అంటూ వ్యాఖ్యలు
గాడ్ ఫాదర్ చిత్రం రేపు (అక్టోబరు 5) రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నట్టు ప్రచారం జరగడంపై స్పందించారు. "ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తారో గానీ వాళ్లు గొప్ప క్రియేటర్స్... అలాంటివాళ్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందించవచ్చు... ఆ కథలతో అద్భుతమైన సినిమాలు వస్తాయి" అంటూ సెటైర్ వేశారు.

ఇక గాడ్ ఫాదర్ గురించి చెబుతూ.... ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు ఉండవని, కథ ఆధారంగానే డైలాగులు రాయడం జరిగిందని అన్నారు. రాజకీయాలు, కుటుంబం... రెండూ కలిస్తే ఈ సినిమా అని వివరించారు. 

నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' చిత్రం కూడా రేపు రిలీజ్ కానుండడంపై చిరంజీవి స్పందిస్తూ, పండగ నాడు ఇద్దరం కలిసి భోజనానికి వెళుతున్నట్టు ఉందని చమత్కరించారు. తామిద్దరి చిత్రాలు ఒకే రోజున విడుదల కానుండడం ఆనందదాయకం అని పేర్కొన్నారు.

Chiranjeevi
Politics
Speculation
Satire
God Father
Press Meet
Tollywood

More Telugu News